: జైల్లో శ్రీశాంత్ కష్టాలు
ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా సెలబ్రిటీ హోదాలో రాచమర్యాదలు అందేవి. కానీ, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో తీహార్ జైలుకెళ్లిన శ్రీశాంత్ కు తానెంత తప్పు చేశానో అప్పుడే అతడికి అనుభవంలోకి వచ్చింది. మరో ఇద్దరు ఖైదీలతో కారాగారవాసం. క్యూలో నిలబడి జైలు కూడు పళ్లెంలో తెచ్చుకుని తినడం. పైగా నిద్ర పట్టక రాత్రంతా గదిలో అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడట. అవసరముంటే తప్పించి ఎవరితోనూ మాట్లాడడం లేదట. ఈ విషయాన్ని జైలు వర్గాలు తెలిపాయి. బుద్ది గడ్డి తింటే ఇదే పరిస్థితి ఎదురవుతుంది.