Chandrababu: రాజకీయం తెలియని వ్యక్తి సీఎం కావాలనుకుంటున్నాడు: పవన్‌పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్

AP Dy CM Narayana Swamy Fires on Pawan Kalyan

  • పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ఒకటి రెండు సీట్లు కూడా రావు
  • జగన్ రాజన్న పాలన అందిస్తున్నారు
  • జగన్‌పై కుట్రలు చేసిన చంద్రబాబు, సోనియా ఇప్పుడు దెబ్బతిన్నారు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతిలో నిన్న జరిగిన నియోజకవర్గ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు రాజకీయమే తెలియదని, అలాంటి వ్యక్తి సీఎం కావాలని తహతహలాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన కనుక ఒంటరిగా పోటీ చేస్తే ఒకటి రెండు సీట్లు కూడా రావని తేల్చి చెప్పారు. 

బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగన్ రాష్ట్రంలో రాజన్న పాలన సాగిస్తున్నారని అన్నారు. ఆయనపై కుట్రలు చేసి జైలుకు పంపేందుకు కారణమైన సోనియాగాంధీ, చంద్రబాబు ఇప్పుడు రాజకీయంగా తీవ్రంగా దెబ్బతిన్నారని నారాయణస్వామి అన్నారు.

Chandrababu
Pawan Kalyan
Narayana Swamy
Jagan
Janasena
YSRCP
  • Loading...

More Telugu News