Sanjay Raut: 24 గంటల్లో మీ పదవులు పోతాయి... షిండే వర్గంలోని మంత్రులకు శివసేన వార్నింగ్

Sanjay Raut warns rebel ministers

  • మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
  • శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండే
  • రెబెల్ మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగిస్తామన్న రౌత్
  • షిండేనే నిర్ణయం తీసుకుంటారన్న రెబెల్ ఎమ్మెల్యే పాటిల్

తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మంత్రులకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హెచ్చరికలు చేశారు. ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరిన మంత్రులు 24 గంటల్లో పదవులు కోల్పోతారని రౌత్ స్పష్టం చేశారు. రెబెల్ వర్గం మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగిస్తామని వెల్లడించారు. సీనియర్ క్యాబినెట్ మంత్రి షిండే నేతృత్వంలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికారాన్ని ముఖ్యమంత్రి, శివసేన చీప్ ఉద్ధవ్ థాకరేకు కట్టబెడుతూ పార్టీ జాతీయ కార్యవర్గం తీర్మానం చేసింది. 

మరోవైపు, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సంప్రదాయ శత్రువులని, అలాంటి పార్టీలతో భాగస్వామ్యం అనైతికమని షిండే వర్గం ఎమ్మెల్యే చిమన్ రావు పాటిల్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీలు తమకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయని, అలాంటి పార్టీలతో పొత్తు సరికాదని అన్నారు. సీఎం ఉద్ధవ్ థాకరే ఇకనైనా సహజసిద్ధ పొత్తు కుదుర్చుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. కానీ, ఉద్ధవ్ థాకరే నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో, ఇక తమ నాయకుడు ఏక్ నాథ్ షిండేనే నిర్ణయం తీసుకుంటారని పాటిల్ వెల్లడించారు.

Sanjay Raut
Shiv Sena
Rebel
Eknath Shinde
Maharashtra
  • Loading...

More Telugu News