Ram: కొత్త రికార్డుల దిశగా దూసుకెళుతున్న 'బుల్లెట్' సాంగ్!

The Warrior Movie Update

  • రామ్ తాజా చిత్రంగా రూపొందిన 'ది వారియర్'
  • కథానాయికగా అలరించనున్న కృతి శెట్టి
  • ప్రతినాయకుడి పాత్రలో ఆకట్టుకోనున్న ఆది పినిశెట్టి
  • జులై 14వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల

రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' సినిమా రూపొందింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి 'బుల్లెట్' సాంగ్ ను రిలీజ్ చేశారు. రామ్ - కృతి శెట్టిపై ఈ పాటను కలర్ఫుల్ గా చిత్రీకరించారు.

తెలుగు - తమిళ భాషల్లో ఈ సినిమాను జులై 14వ తేదీన విడుదల చేయనున్నారు. అందువలన ఒకేసారి ఈ రెండు భాషల్లోను ఈ పాటను వదిలారు. హీరో శింబు పాడిన ఈ పాట యూ ట్యూబ్ లో ఇలా వదలగానే దూసుకుపోవడం మొదలైంది. అప్పుడు మొదలైన దూకుడు ఇంతవరకూ తగ్గలేదు. 

ఇంతవరకూ ఈ పాట 125 మిలియన్ ప్లస్ వ్యూస్ ను అందుకుంది. ఇంకా అదే స్పీడ్ తో ముందుకు వెళుతోంది. మొత్తానికి కొత్త రికార్డులను కొల్లగొట్టే ప్రయత్నంలోనే ఈ పాట ఉంది. ఇక రీసెంట్ గా వదిలిన 'విజిల్ సాంగ్' కూడా ఒక రేంజ్ లో దూసుకెళుతుండటం విశేషం. ముఖ్యమైన పాత్రల్లో నదియా .. అక్షర గౌడ నటించగా, విలన్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నాడు.

Ram
Kruthi Shetty
The Warrior Movie
  • Loading...

More Telugu News