Naga Babu: 'అప్పుడు నాకు జ్ఞానం లేదు... ఇప్పుడు నువ్వు లేవు' అంటూ త‌న తండ్రికి నాగ‌బాబు బ‌ర్త్ డే విషెస్‌

naga babu emotional post on his fathers birth anniversary

  • తండ్రి జ‌యంతి సంద‌ర్భంగా నాగ‌బాబు ట్వీట్‌
  • బ‌తికుండ‌గా విషెస్ చెప్పాల‌న్న జ్ఞానం లేద‌ని వ్యాఖ్య‌
  • ఆ జ్ఞానం వ‌చ్చాక చెబుదామంటే ఇప్పుడు లేరంటూ ఆవేద‌న‌
  • ఆప్తుల‌కు బ‌తికుండ‌గానే అన్నీ చెప్పేయండ‌ని పిలుపు
  • నాగ‌బాబు ట్వీట్‌పై స్పందించిన బండ్ల గ‌ణేశ్‌

జ‌న‌సేన పీఏసీ స‌భ్యుడు, ప్ర‌ముఖ సినీ న‌టుడు నాగ‌బాబు శ‌నివారం త‌న తండ్రి జయంతిని పుర‌స్క‌రించుకుని విభిన్న రీతిలో తండ్రికి విషెస్ చెప్పారు. నీవు బ‌తికి ఉండ‌గా... నీకు బ‌ర్త్ డే విషెస్ చెప్పాల‌న్న సెన్స్ గానీ, జ్ఞానం గానీ అప్పుడు తనకు లేవ‌ని స‌ద‌రు సందేశంలో నాగ‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే సెన్స్‌తో పాటు జ్ఞానం వ‌చ్చాయ‌నుకున్న‌ప్పుడు బ‌ర్త్ డే విషెస్ చెబుదామంటే నీవు లేవంటూ భావోద్వేగ వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా నాగ‌బాబు శ‌నివారం మ‌ధ్యాహ్నం ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్ కు మ‌రో కీల‌క అంశాన్ని కూడా ఆయ‌న జ‌త చేశారు. 'మీ భావోద్వేగాలతో పాటు ప్రేమ‌ను మీ స‌న్నిహితులు బ‌తికున్న‌ప్పుడే వారికి తెలియ‌జేయండి' అంటూ ఆయ‌న పిలుపునిచ్చారు. త‌న ట్వీట్‌కు ఆయ‌న త‌న తండ్రి ఫొటోను జ‌త చేశారు. ఈ ట్వీట్‌ను చూసిన టాలీవుడ్ నిర్మాత బండ్ల గ‌ణేశ్ నిజం చెప్పారంటూ నాగబాబును ప్రశంసించారు. 

Naga Babu
Janasena
Twitter
Bandla Ganesh

More Telugu News