YSRCP: అమాయ‌కుడిని అయితే నాలుగు సార్లు ఎలా గెలుస్తా?: వైసీపీ ఎమ్మెల్యే ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌

ysrcp mla dharmana krishna das comments on his stamina

  • అంతా అనుకుంటున్న‌ట్లు ఆమాయ‌కుడిని కాద‌న్న ధ‌ర్మాన‌
  • హ‌ద్దు మీరే వారిపై జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేస్తాన‌ని హెచ్చ‌రిక‌
  • న‌ర‌స‌న్నపేట‌లో వైసీపీ కార్య‌కర్త‌ల భేటీలో కృష్ణ‌దాస్ వ్యాఖ్య‌లు

వైసీపీ కీల‌క నేత‌, న‌ర‌స‌న్న పేట శాస‌న‌స‌భ్యుడు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ శ‌నివారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను అంద‌రూ అమాయ‌కుడు అనుకుంటున్నార‌ని, అయితే తాను మాత్రం అమాయకుడిని కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతా అనుకుంటున్న‌ట్లు తాను అమాయ‌కుడినే అయితే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాన‌ని కూడా ఆయ‌న లాజిక్ తీశారు. ఈ మేర‌కు శ‌నివారం న‌ర‌స‌న్న‌పేట‌లో జ‌రిగిన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

మొన్న‌టిదాకా రెవెన్యూ శాఖ మంత్రి హోదాలో ఏపీ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా కొన‌సాగిన ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌...ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌విని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. మంత్రి ప‌ద‌వి కోల్పోయిన ఆయ‌న‌ను పార్టీ విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడుగా జ‌గ‌న్ నియ‌మించారు. పార్టీ జిల్లా అధ్య‌క్షుడి హోదాలోనే ఆయ‌న శ‌నివారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ శ్రేణులు హ‌ద్దు మీరితే జ‌గ‌న‌న్న‌కు ఫిర్యాదు చేస్తాన‌ని కూడా ధ‌ర్మాన చెప్ప‌డం గ‌మ‌నార్హం.

YSRCP
Vijayanagaram District
Narasannapeta
Dharmana Krishna Das
  • Loading...

More Telugu News