Akash: నిరాశపరిచిన సీనియర్ నటి అర్చన రీ ఎంట్రీ!

Chor Bazaar movie update

  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'చోర్ బజార్'
  • ఆకాశ్ జోడీగా నటించిన గెహనా సిప్పీ 
  • 25 ఏళ్ల తరువాత అర్చన రీ ఎంట్రీ
  • ఆశించిన స్థాయిలో లేని పాత్ర

తెలుగులో చెప్పుకోదగిన సినిమాలలో 'నిరీక్షణ' ఒకటి. బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాను, అందులో అర్చన నటనను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ తరువాత 'లేడీస్ టైలర్' .. 'దాసి' .. 'భారత్ బంద్' వంటి సూపర్ హిట్స్ ఆమె ఖాతాలో కనిపిస్తాయి. సహజమైన నటిగా ఆమెకి మంచి గుర్తింపు .. గౌరవం ఉన్నాయి. 

నటన ప్రధానమైన పాత్రల వైపు మాత్రమే ఆమె మొగ్గు చూపుతూ వచ్చారు. పాత్ర నచ్చితేనే ఒప్పుకునే అతి తక్కువమంది కథానాయికలలో ఆమె ఒకరు. అలాంటి ఆమె తెలుగు సినిమాకి దూరమై పాతికేళ్లకి పైనే అయింది. అలాంటి ఆమె 'చోర్ బజార్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఒప్పుకుందంటే ఆ పాత్రలో ఏదో ప్రత్యేకత ఉందనే అంతా అనుకుంటారు. 

కానీ అలాంటి ప్రత్యేకత ఏదీ ఆమె పాత్రలో కనిపించదు. ఆమె నటనను వంక బెట్టలేం .. కానీ అది ఆమె స్థాయికి తగిన బలమైన పాత్ర కాదనే అనిపిస్తుంది. అమితాబ్ అభిమానిగా టీనేజ్ లో రెండుజెళ్ల అర్చన సీన్స్ ను చూపించినప్పుడు ఈ అభిప్రాయం మరింత బలపడుతుంది. ఇలాంటి ఒక పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం ఆమె అభిమానులకు నిరాశను కలిగించింది.

Akash
Gehana Sippy
Chor Bazaar Movie
Archana
  • Loading...

More Telugu News