Regional Ring Road: ఆర్​ఆర్​ఆర్​లో 11 చోట్ల ఇంటర్​ ఛేంజ్​లు..ఎక్కడెక్కడంటే..!

NHAI finalized 11 inter changes for the RRR project

  • ఖరారు చేసిన ఎన్ హెచ్ఏఐ
  • 330 కి.మీ. నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ పై తగ్గనున్న ట్రాఫిక్ ఒత్తిడి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు పనుల విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు 11 చోట్ల ఇంటర్ ఛేంజ్ లను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) ఖరారు చేసింది. వాహనాల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ అవతల మరో రింగ్ రోడ్డు ఉండాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం 2018లో ఈ ప్రాజెక్టును ప్రకటించింది. 

    హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న జిల్లాలను అనుసంధానిస్తూ ఆరు లేన్లలో 330 కిలో మీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డుకు ప్రణాళిక రచించింది. ఆర్ఆర్ఆర్ తో ప్రధాన జాతీయ రహదారులైన ఎన్ హెచ్ 65, ఎన్ హెచ్ 44, ఎన్ హెచ్ 163, ఎన్ హెచ్765 అనుసంధానిస్తే.. హైదరాబాద్ పై, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది. 
      
ఆర్ఆర్ఆర్ కోసం ఇప్పటికే భూ సర్వే పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి పలు అనుమతులు లభిస్తున్నాయి. తాజాగా ఇంటర్ ఛేంజ్ లను ఖరారు చేయడంతో కీలక మందడుగు పడినట్టయింది. ఇంటర్ ఛేంజ్ లు ఉన్న ప్రాంతాల్లో ఆయా గ్రామాల ప్రజలకు, ప్రయాణికులకు, ట్రాఫిక్ సులువుగా వెళ్లేందుకు ఫ్లై ఓవర్లను నిర్మించనున్నారు. ఆర్ఆర్ఆర్ మీదకు ఎక్కడం, దిగడం కోసం మరి కొన్ని ప్రాంతాల్లో ఓఆర్ఆర్ పై ఉన్నట్టు ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నట్లు ఎన్ హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. ఇంటర్ ఛేంజర్లు వచ్చే ప్రాంతాలను ఎన్ హెచ్ఏఐ ప్రకటించింది. వాటి వివరాలు ఇవి..

రహదారి పేరు                  ఇంటర్ ఛేంజర్‌ నిర్మించే ప్రాంతం             
1.హైదరాబాద్ - పూణె              గిర్మాపూర్                            
2.హైదరాబాద్-నాందేడ్             శివంపేట                            
3.హైదరాబాద్ -మెదక్              పెద్ద చింతకుంట               
4.హైదరాబాద్ -నాగ్ పూర్         ఇస్లాంపూర్                      
5. తూఫ్రాన్- గజ్వేల్                 మెంటూర్                            
6. హైదరాబాద్ - మంచిర్యాల     ప్రజ్ఞాపూర్                 
7. ప్రజ్ఞాపూర్- భువనగిరి          పీర్లపల్లి                             
8. యాదాద్రి-కీసర                  దత్తాయిపల్లి                         
9. హైదరాబాద్ -వరంగల్          రాయగిరి                      
10. భువనగిరి- నల్లగొండ         రెడ్ల రేపాక                       
11. హైదరాబాద్ -విజయవాడ      చౌటుప్పల్

Regional Ring Road
RRR
NHAI
inter changes
Telangana
Telangana Government
Hyderabad
hyderabad traffic
  • Loading...

More Telugu News