Lawrence: ఆసక్తిని రేపుతున్న లారెన్స్ 'రుద్రుడు' ఫస్టులుక్!

Rudrudu First Look Released

  • కథిరేసన్ దర్శకత్వంలో లారెన్స్ 'రుద్రుడు'  
  • యాక్షన్ నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా ప్రియాభవాని శంకర్
  • కీలకమైన పాత్రలో శరత్ కుమార్

ఇటు యాక్షన్ సినిమాలు .. అటు హారర్ థ్రిల్లర్ సినిమాలు చేయడంలో లారెన్స్ సిద్ధహస్తుడు. ఆ మధ్య వరుస సినిమాలతో సంచలనాలు నమోదు చేసిన లారెన్స్, కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఆయన మార్క్ సినిమాలను ఇష్టపడేవారు .. ఆయన సినిమాల కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రమైన 'రుద్రుడు' నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'దెయ్యాలు పుట్టవు .. సృష్టించబడతాయి' అనే బేస్ లైన్, సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఉంది. జాతరలో విలన్ గ్యాంగ్ భరతం పడుతున్న లారెన్స్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, కథిరేసన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మరికొన్ని రోజుల్లో మొత్తం షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. తమిళ .. తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను క్రిస్మస్ కి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు..

Lawrence
Priya Bhavani
Kathiresan
Rudrudu Movie
  • Loading...

More Telugu News