Sudeep: కథను దాచగలరు .. భయాన్ని దాచలేరు: 'విక్రాంత్ రోణ' ట్రైలర్ రిలీజ్!

Vukranth Rona trailer released

  • 'విక్రాంత్ రోణ'గా సుదీప్ 
  • సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న కంటెంట్ 
  • వచ్చేనెల 28వ తేదీన భారీ రిలీజ్

సుదీప్ కి కన్నడలో మాత్రమే కాదు ..  ఇతర భాషల్లోను అభిమానులు ఉన్నారు. నటనలో తనదైన ప్రత్యేకత అందుకు కారణమని చెప్పాలి. ఆయన బాడీ లాంగ్వేజ్  .. డైలాగ్ డెలివరీ డిఫరెంట్ గా ఉంటాయి. కన్నడలో ఆయన తాజా చిత్రంగా 'విక్రాంత్ రోణ' రూపొందింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది. 
 
కన్నడతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లోను ఈ సినిమాను జులై 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను వదిలారు. ''అది ఒక మర్మమైన ఊరు .. ఆ ఊరు ప్రజలు ఒక భయంకరమైన నిజాన్ని దాచాలనుకుంటున్నారు. కథను దాచగలరుగానీ .. భయాన్ని దాచలేరు" అనే వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ నడిచింది. 

ఆ ఊరిలోని రహస్యాన్ని ఛేదించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ గా సుదీప్ కనిపిస్తున్నాడు. నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ బాగున్నాయి. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నీతా ఆకాశ్ .. జాక్విలిన్ .. నిరూప్ భండారి .. రవిశంకర్ గౌడ ముఖ్యమైన పాత్రల్లో  కనిపించనున్నారు.

Sudeep
Neetha Akash
Vikranth Rona Movie

More Telugu News