Civil Services Examination: సివిల్స్ మెయిన్స్‌కు 13,090 మందికి అర్హ‌త‌

upsc releases civils prilims results

  • సివిల్స్ ప్రిలిమ్స్ ఫ‌లితాల విడుద‌ల‌
  • ప్రిలిమ్స్‌లో 13,090 మంది ఉత్తీర్ణ‌త‌
  • సెప్టెంబ‌ర్ 16 నుంచి నుంచి సివిల్స్ మెయిన్స్‌

ఐఏఎస్‌, ఐపీఎస్ వంటి అఖిల భార‌త స‌ర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఏటా నిర్వ‌హిస్తున్న సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఈ ఏడాది ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల‌య్యాయి. ఈ ప‌రీక్ష‌కు భారీ సంఖ్య‌లో అభ్య‌ర్థులు హాజరు కాగా... సివిల్స్ మెయిన్స్‌కు కేవ‌లం 13,090 మంది మాత్ర‌మే అర్హ‌త సాధించారు. సివిల్స్ మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన వారికి సెప్టెంబ‌ర్ 16 నుంచి 21 వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు యూపీఎస్సీ ప్ర‌క‌టించింది.

Civil Services Examination
UPSC
Civils Mains
Civils Prilims
  • Loading...

More Telugu News