Ranil Vikramasinghe: దేశంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన శ్రీలంక ప్రధాని

Country is in worst state says Sri Lanka PM

  • దేశం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న ప్రధాని 
  • దిగుమతి చేసుకున్న ఇంధనాన్ని కూడా కొనలేకపోతున్నామని ఆవేదన 
  • పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని వ్యాఖ్య 

శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఆహారం, విద్యుత్, ఇంధన కొరతతో ఆ దేశం సతమతమవుతోంది. అయితే అంతకు మించిన గడ్డు పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని పార్లమెంటు సాక్షిగా ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పారు. ఆహారం, విద్యుత్, ఇంధన కొరతతో దేశం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని... దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని అన్నారు. 

దేశం చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు. పెట్రోలియం కార్పొరేషన్ భారీ అప్పుల్లో కూరుకుపోయిందని... దిగుమతి చేసుకున్న ఇంధనాన్ని కూడా కొనుగోలు చేయలేకపోతోందని అన్నారు. సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దే అవకాశాన్ని ఇప్పటికే ప్రభుత్వం కోల్పోయిందని చెప్పారు. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అన్నారు. పెట్రోలియం కార్పొరేషన్ 700 మిలియన్ల డాలర్ల అప్పులో ఉందని, ప్రపంచంలోని ఏ దేశం కానీ, ఏ సంస్థ కానీ శ్రీలంకకు ఇంధనాన్ని అందించడానికి సిద్ధంగా లేవని చెప్పారు.

  • Loading...

More Telugu News