Akash Puri: తెలుగు తెరకు మరో ముంబై బ్యూటీ!

Chor Bazaar movie update

  • టాలీవుడ్ తెరపై కొత్త కథానాయికల జోరు 
  • 'చోర్ బజార్'తో పరిచయమవుతున్న 'గెహనా సిప్పీ'
  • ఆకాశ్ పూరి జోడీగా సందడి 
  • ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన కథానాయికలలో కృతి శెట్టి .. శ్రీలీల .. కేతిక శర్మ వరుస అవకాశాలను అందుకుంటూ వెళుతున్నారు. ఇక 'లైగర్' సినిమాతో అనన్య పాండే .. 'ఏజెంట్' తో సాక్షి వైద్య .. నాగశౌర్య సినిమాతో షిర్లే సెటియా కథానాయికలుగా పరిచయమవుతున్నారు.

ఇక వీళ్లందరితో పాటు మరో ముంబై బ్యూటీ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఆ సుందరి పేరే 'గెహనా సిప్పీ'. మోడలింగ్ నుంచి వచ్చిన గెహనా సిప్పీ, 'చోర్ బజార్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఆకాశ్ పూరి హీరోగా నటించిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన థియేటర్లలో దిగిపోతోంది. 

'జార్జి రెడ్డి' దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఖరీదైన ఓ వజ్రం చుట్టూ తిరుగుతుంది. యాక్షన్ తో పాటు కావలసినంత కామెడీ ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. ఈ సినిమాతో గెహనా సిప్పీ ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో .. ఎన్ని అవకాశాలను అందుకుంటుందో చూడాలి.

Akash Puri
Gehna Sippy
Chor Bazaar Movie
  • Loading...

More Telugu News