halapathy vijay: విజయ్ చిత్రానికి 'వారసుడు' టైటిల్ ఖరారు.. అధికారిక ప్రకటన!

vijay new movie film titled varasudu

  • వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ కొత్త సినిమా
  • తెలుగులో ‘వారసుడు’.. తమిళ్ లో ‘వారిసు’ టైటిల్ ఖరారు
  • హీరోయిన్ గా రష్మిక మందన్న

తమిళ స్టార్ హీరో విజయ్ కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతాయి. వాటిలో చాలా మంచి విజయాలు కూడా సాధించాయి. ఇటీవలే ‘బీస్ట్‌’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన విజయ్‌ ఇప్పుడు నేరుగా తెలుగులో ఓ సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇది విజయ్‌ నటిస్తున్న 66వ చిత్రం. రష్మిక మందన్న నాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాత. 

 ఈ సినిమాకు ‘వారసుడు’ అనే టైటిల్ ను తాజాగా ఖరారు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. 1993లో ఇదే టైటిల్ తో నాగార్జున, నగ్మ హీరో, హీరోయిన్లుగా ఓ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో అది మంచి సక్సెస్ సాధించింది.  

 మరోవైపు ఈ చిత్రానికి తమిళంలో ‘వారిసు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. బుధవారం విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్ర బృందం హీరో ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్‌ను వెల్లడించింది. సూట్‌ ధరించిన విజయ్ క్లాస్ లుక్ లో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ద బాస్‌ రిటర్న్స్‌ అనే క్యాప్షన్‌ పెట్టారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు.

halapathy vijay
new movie
Tollywood
Kollywood
Dil Raju
vamshi paidipally
Rashmika Mandanna
Nagarjuna
varasudu

More Telugu News