Gopichand: ఇది 'పక్కా' ఫ్యామిలీ ఎంటర్టయినర్: దర్శకుడు మారుతి

Pakka Commercial team interview

  • మారుతి తాజా చిత్రంగా 'పక్కా కమర్షియల్'
  • గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా 
  • జులై 1వ తేదీన సినిమా విడుదల
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్    

గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా 'పక్కా కమర్షియల్' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 - యూవీ వారు కలిసి ఈ సినిమాను నిర్మించారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జులై 1వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. 

తాజా ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ  .. " ఈ సినిమాలో గోపీచంద్ - రాశి ఖన్నా లాయర్లుగా కనిపించనున్నారు. కనుక లాయర్లు పక్కా కమర్షియల్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కమర్షియల్ గా ఉండటమనేది వృత్తిని బట్టి కాకుండా వ్యక్తిని బట్టి ఉంటుంది. ఎంతవరకూ కమర్షియల్ గా ఉండాలనేదే ఇందులో చూపించాము. 

ఇక 'పక్కా కమర్షియల్' అనగానే ఇందులో అన్నీ ఫైట్లే ఉంటాయి ... ఇది యాక్షన్ సినిమా అనుకోవద్దు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందులో ఎలాంటి సందేహం లేదు. కథాకథనాలు .. మాటలు .. పాటలు అన్నీ కూడా చాలా సరదాగా సాగిపోతాయి" అని చెప్పుకొచ్చాడు.

Gopichand
Rashi Khanna
Pakka Commercial Movie
  • Loading...

More Telugu News