Akash Puri: ఇంతకన్నా ఏ తండ్రి మాత్రం ఏం చేస్తాడు?: ఆకాశ్ పూరి

Akash Puri Interview

  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'చోర్ బజార్'
  • ఈ నెల 24వ తేదీన  ప్రేక్షకుల ముందుకు 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఆకాశ్ పూరి 
  • తనకి తానుగా ఎదగడానికి ట్రై చేస్తున్నానంటూ వ్యాఖ్య    

ఆకాశ్ పూరి హీరోగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'చోర్ బజార్' సినిమా ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆకాశ్ మాట్లాడుతూ .. " మాస్ హీరోగా నన్ను మా నాన్న ప్రెజెంట్ చేయవచ్చుగదా అనే కామెంట్లు వినపడుతున్నాయి. 

మా నాన్న నన్ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నేను హీరోగా సినిమాను నిర్మించారు. ఇంతకన్నా ఏ తండ్రి మాత్రం ఏం చేస్తాడు? ఇంకా ఇది చేయాలి నాన్న అని ఏ ముఖం పెట్టుకుని అడుగుతాను? ఇక ఇప్పుడు నేను నా అంతటా నేనుగా ఎదగాలి. అంతేకానీ ఏ ఫాదర్ కూడా కొడుక్కి స్టార్ డమ్ ఇవ్వలేడు. 

ఎవరి కాళ్లపై వాళ్లు ఎదగాలనే నాన్న చెప్పింది. అందువల్లనే నా కథలు నేను వింటున్నాను .. నా సినిమాల విషయంలో నేనే నిర్ణయాలు తీసుకుంటున్నాను. పోస్టర్స్ చూసిన వాళ్లంతా ఇప్పుడు కాస్త హీరోలా కనిపిస్తున్నావని అంటున్నారు.  ఇక సినిమా చూసిన తరువాత ఆడియన్స్ ఏమంటారో చూడాలి" అంటూ చెప్పుకొచ్చాడు.

Akash Puri
Jeevan Reddy
Chor Bazaar movie
  • Loading...

More Telugu News