Global Dream-II: ప్రపంచంలోనే ఇది అతిపెద్ద లగ్జరీ ఓడ... కొనే నాథుడు లేక ఏ పార్టుకు ఆ పార్టు తీసేస్తున్నారు!

Biggest cruise ship goes to scrapyard

  • జర్మనీలోని ఓ షిప్ యార్డ్ లో ఉన్న నౌక
  • దివాలా తీసిన యజమానులు
  • నౌకను స్వాధీనం చేసుకున్న బ్యాంకులు!

గ్లోబల్ డ్రీమ్-2... ఇది ఒక అత్యంత విలాసవంతమైన ఓడ పేరు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ లైనర్లలో ఒకటి అవ్వాల్సిన ఓడ ఇది. ప్రస్తుతం ఇది జర్మనీలోని ఓ షిప్ యార్డ్ లో ఉంది. గ్లోబల్ డ్రీమ్-2 దురదృష్టం ఏమిటంటే... దీని సొంతదారులు దివాలా తీశారు. ఇక, ఇంత పెద్ద ఓడను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. దాంతో దీన్ని ఏ భాగానికి ఆ భాగం విడదీసి తుక్కు సామాను కింద అమ్మేయనున్నారు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ క్రూయిజ్ నౌక ఒక్కసారి కూడా సముద్రయానం చేయలేదు. తొలి ప్రయాణమే తుక్కు సామాన్ల యార్డుకు చేస్తోంది.  

గ్లోబల్ డ్రీమ్-2కు ఓ సోదర నౌక కూడా ఉంది. దాని పేరు గ్లోబల్ డ్రీమ్. దాన్ని మాత్రం సముద్రయానాలకు సమాయత్తం చేసి, అప్పులు తీర్చుకోవాలన్న యోచనలో యాజమాన్యం ఉంది. ఆసియాకు చెందిన డ్రీమ్ క్రూయిజస్ ఈ నౌకల యజమాని. అయితే, కరోనా దెబ్బకు డ్రీమ్ క్రూయిజెస్, దాని మాతృ సంస్థ జెంటింగ్ హాంకాంగ్ ఆర్థికంగా కుప్పకూలాయి. దాంతో, రుణ సంస్థలు ఈ నౌకలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News