Sai Pallavi: తనను 'లేడీ పవర్ స్టార్' అనడంపై సాయిపల్లవి స్పందన

Sai Pallavi opines on Lady Powerstar tag

  • ఇటీవల విరాటపర్వం రిలీజ్
  • సాయిపల్లవి నటనకు నీరాజనాలు
  • లేడీ పవర్ స్టార్ అంటున్న సినీ ప్రేమికులు
  • పేరుకు ముందు ట్యాగ్స్ సరికాదంటున్న సాయిపల్లవి

విరాటపర్వం చిత్రంలో వెన్నెల పాత్రతో సాయిపల్లవి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న సాయిపల్లవిని 'లేడీ పవర్ స్టార్' అంటున్నారు. తనను 'లేడీ పవర్ స్టార్' అంటుండడంపై సాయిపల్లవి స్పందించింది. 

తన పేరుకు ముందు ట్యాగ్ లు తగిలించడం సరికాదని అభిప్రాయపడింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలను దృష్టిలో ఉంచుకుని తాను మంచి పాత్రల్లో నటించడంపై శ్రద్ధ చూపిస్తానే తప్ప, ఇలాంటి ట్యాగ్ లను ఇష్టపడబోనని స్పష్టం చేసింది. తనకింత పేరుప్రఖ్యాతులు లభించాయంటే, తాను పోషించిన పాత్రలను సినీ ప్రేమికులు ఇష్టపడడం వల్లేనని వివరించింది. 

ఇలాంటి ట్యాగ్ ల కారణంగా మనమీద మనమే ఒత్తిడి పెంచుకున్నట్టవుతుందని, అది నటనపైనా ప్రభావం చూపుతుందని సాయిపల్లవి వివరించింది. అందుకే ఎలాంటి ట్యాగ్ లు లేకుండా, సాధారణరీతిలో ఉండేందుకు ప్రాధాన్యత నిస్తానని అభిప్రాయం వ్యక్తం చేసింది.

Sai Pallavi
Lady Powerstar
Tag
Virata Parvam
Tollywood
  • Loading...

More Telugu News