Rana Daggubati: 'విరాటపర్వం' కోసం అడవిలో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు : రానా

Virataparvam movie update

  • ఈ నెల 17న వచ్చిన 'విరాటపర్వం'
  • ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఎమోషన్
  • కొనసాగుతూనే ఉన్న ప్రమోషన్స్ 
  • షూటింగ్ విశేషాలు ప్రస్తావించిన రానా  

రానా -  సాయిపల్లవి కాంబినేషన్లో రూపొందిన 'విరాటపర్వం' సినిమా, ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథాకథనాల పరంగా, సంగీతం .. ఫొటోగ్రఫీ పరంగా ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసింది. విడుదల తరువాత కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా టీమ్ ను సిద్ధూ జొన్నలగడ్డ ఇంటర్వ్యూ చేశాడు.

ఈ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ .. "ఈ సినిమాకి డానీ కెమెరామెన్ .. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీని అందించారు. రష్యా .. జర్మనీకి చెందిన టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. వీళ్లెవరికీ తెలుగు తెలియదు. వాళ్లందరినీ కలిపి .. అర్థమయ్యేలా అంతా చెప్పి, మనకి అవసరమైన అవుట్ పుట్ రాబట్టుకోవడం ఒక పరీక్ష.

ఒక రోజున మిహికా బజాజ్ షూటింగు చూడటానికి వచ్చి .. ఒక సినిమా చేయడానికి ఇంత కష్టపడతారా? అంటూ చాలా ఆశ్చర్యపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా అడవుల్లోనే జరిగింది. ఎలాంటి వసతి సౌకర్యాలు లేని ఆ ప్రదేశాల్లో మేము చాలా కష్టాలు పడ్డాము. ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ను చూస్తుంటే ఆ కష్టాన్నంతా మరిచిపోతున్నాము" అని చెప్పుకొచ్చాడు.

Rana Daggubati
Sai Pallavi
Virataparvam Movie
  • Loading...

More Telugu News