Dead Bodies: ఒకే ఇంట్లో 9 మృతదేహాలు... మహారాష్ట్రలో ఘటన

Nine dead bodies found in a house in Maharashtra

  • సాంగ్లీ జిల్లాలో కలకలం
  • మృతదేహాలు పోస్టుమార్టంకు తరలింపు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • విషం తాగి ఉంటారని అంచనా

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే ఇంట్లో 9 మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. మాయిసాల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరంతా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరిలో ముగ్గురి మృతదేహాలు ఒకే చోట పడివుండగా, మిగిలిన ఆరు మృతదేహాలు ఇంట్లో వివిధ చోట్ల పడివుండడాన్ని పోలీసులు గుర్తించారు. వారంతా విషం తాగి చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోస్టుమార్టం అనంతరం దీనిపై స్పష్టత రానుంది. వారి ఆత్మహత్యకు కారణమేంటన్నది తెలియరాలేదు.

Dead Bodies
Mhaisal
Sangli District
Police
Maharashtra
  • Loading...

More Telugu News