Musharraf: ముషారఫ్ ఇక పాకిస్థాన్ కు రానట్టే.. కారణం ఇదే..!
- అరుదైన అమైలాయిడోసిస్ వ్యాధితో బాధపడుతున్న ముషారఫ్
- ముషారఫ్ కు దారాతుముమాబ్ అనే ఔషధాన్ని ఇస్తున్న వైద్యులు
- పాకిస్థాన్ లో ఈ ఔషధం లభించని వైనం
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ సైన్యాధ్యక్షుడు ముషారఫ్ అత్యంత అరుదైన అమైలాయిడోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన చనిపోయినట్టు కూడా ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. అయితే ఆయన బతికున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఆయన బతకడం దాదాపు అసాధ్యమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన యూఏఈలో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో దాదాపు జీవితం చివరి దశలో ఉన్న ముషారఫ్ ను పాకిస్థాన్ కు రప్పించేందుకు పాక్ ఆర్మీ అన్ని ఏర్పాట్లు చేసింది. దుబాయ్ నుంచి తీసుకొచ్చేందుకు ఎయిర్ అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేసింది. అయితే జీవితం చరమాంకంలో ఆయనకు సొంత దేశానికి వెళ్లే అవకాశాలు మూసుకుపోయాయి. ఆయన చికిత్సకు అవసరమైన ఔషధం పాకిస్థాన్ లో లేకపోవడమే దీనికి కారణం. ప్రస్తుతం ముషారఫ్ కు దారాతుముమాబ్ అనే ఔషధాన్ని ప్రయోగాత్మకంగా ఇస్తున్నారు. ఇది పాకిస్థాన్ లో లభించకపోవడంతో... ఆయన స్వదేశానికి తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది.