Balakrishna: బాలయ్య కోసం రాజశేఖర్ ను ఒప్పించిన అనిల్ రావిపూడి!

Rajasekhar in Anil Ravipudi Movie

  • హీరోగా బిజీగా ఉన్న రాజశేఖర్
  • బాలయ్య 108వ సినిమా కోసం ఒప్పించిన అనిల్ రావిపూడి
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
  • తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పనున్న రాజశేఖర్

రాజశేఖర్ ఒక వైపున హీరోగా సినిమాలు చేస్తూనే, విలన్ గా చేయడానికి కూడా తాను సిద్ధంగానే ఉన్నట్టుగా సంకేతాలిస్తున్నారు. అయితే హీరోగా తప్ప మరో పాత్రలో ఇంతవరకూ ఆయన తెరపై కనిపించలేదు. 'బలరామకృష్ణులు' తరువాత ఆయన మల్టీస్టారర్ లు చేసింది కూడా లేదు.

అలాంటి రాజశేఖర్ ను బాలయ్య సినిమా కోసం అనిల్ రావిపూడి ఒప్పించినట్టుగా తెలుస్తోంది. బాలయ్య కథానాయకుడిగా అనిల్ రావిపూడి ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథ. కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుంది. 

ఈ సినిమా కోసమే రాజశేఖర్ ను తీసుకున్నట్టుగా సమాచారం. అయితే ఇది విలన్ రోల్ కాదనీ, కీలకమైన పాత్ర మాత్రమేనని చెబుతున్నారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. 'సరిలేరు నీకెవ్వరు'లో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతిని ఒప్పించిన అనిల్ రావిపూడి, రాజశేఖర్ ను కూడా ఒప్పించడం విశేషం. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ ఒరిజినల్ వాయిస్ ను ఉంచుతున్నారని వినికిడి.

Balakrishna
Sreeleela
Rajasekhar
Anil Ravipudi Movie
  • Loading...

More Telugu News