Kamal: 'విక్రమ్' మూవీలో ఫైట్లు చేసిన ఆ పనిమనిషి ఎవరో తెలుసా?

Vikram movie update

  • ఈ నెల 3వ తేదీన వచ్చిన 'విక్రమ్'
  • 'ఏజెంట్ టీనా' పాత్రకి అనూహ్యమైన గుర్తింపు 
  • ఆమె పేరు వాసంతి .. కోలీవుడ్లో డాన్స్ కొరియోగ్రాఫర్
  • నటిగా ఇదే మొదటి సినిమా
  • లోకేశ్ కి థ్యాంక్స్ చెప్పిన వాసంతి

'విక్రమ్' సినిమాలో హీరో తనయుడు విలన్ చేతిలో చనిపోతాడు. విక్రమ్ కోడలికి .. మనవడికి తోడుగా ఒక పనిమనిషి ఉంటుంది. విక్రమ్ ఫ్యామిలీపై పగతీర్చుకోవడానికిగాను, ఆయన లేని సమయంలో ఆ ఇంటిపైకి విలన్ అనుచరులు వస్తారు. విక్రమ్ సార్ కి కాల్ చేయమని పనిమనిషి ఎంతగా చెప్పినా, ఆయనపై సరైన అభిప్రాయం లేని కారణంగా కోడలు ఆ మాటలు పట్టించుకోదు.

అప్పుడు విలన్ గ్యాంగ్ పైకి ఆ పని మనిషి ఒక్కసారిగా సివంగిలా విరుచుకుపడుతుంది. ఆమె 'ఏజెంట్ టీనా' అనీ .. పనిమనిషిగా ఆ ఇంటికి ఆమెను రక్షణగా ఉంచింది విక్రమ్ అనే విషయాన్ని దర్శకుడు అప్పుడు రివీల్ చేస్తాడు. సినిమాలోని హైలైట్ యాక్షన్ సీన్స్ లో ఇది ఒకటి. పైగా సస్పెన్స్ తో ముడిపడినది. 

సినిమాలో అంతగా ఫైట్స్ చేసిన ఆమె, కోలీవుడ్ లో డాన్స్ కొరియోగ్రాఫర్.. తన పేరు వాసంతి. నటిగా ఆమె స్క్రీన్ పై కనిపించింది ఈ సినిమాతోనే. ఈ సినిమాతో తనకి లభించిన గుర్తింపు పట్ల ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. తనని అంతా కూడా ఏజెంట్ టీనా అనే పిలుస్తున్నారని మురిసిపోతోంది. తనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ కి ధన్యవాదాలు తెలియజేసింది.

Kamal
Vijay Sethupathi
Vasanthi
Vikram Movie
  • Loading...

More Telugu News