Rana Daggubati: అప్పుడు మాత్రం ఏడ్చేశాను: సాయిపల్లవి

Virataparvam movie update

  • నిన్ననే విడుదలైన 'విరాటపర్వం'
  • సక్సెస్ మీట్ ను నిర్వహించిన టీమ్
  • హాజరైన సరళ కుటుంబ సభ్యులు
  • ఉద్వేగానికి లోనైన సాయిపల్లవి 

సాయిపల్లవి - రానా కాంబినేషన్లో రూపొందిన 'విరాటపర్వం' నిన్ననే థియేటర్లకు వచ్చింది. తొలి రోజునే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. సరళ అనే ఒక యువతి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సరళ సోదరుడు కూడా ఈ సక్సెస్ మీట్ కి హాజరయ్యాడు. 

ఈ స్టేజ్ పై సాయిపల్లవి మాట్లాడుతూ .. " సరళగారి పాత్రను పోషించడం గర్వంగా అనిపించింది. కానీ సరళగారి ఫ్యామిలీని కలుసుకున్నప్పుడు మాత్రం కొంచెం భయం వేసింది. ఆ పాత్రను ఎలా చేశానో .. ఏమో అనుకున్నాను. కానీ వాళ్లు నన్ను ఎంతో ఆత్మీయంగా పలకరించి .. ఆదరించి అక్కున చేర్చుకున్నారు. 

సరళగారి కుటుంబ సభ్యులు నన్ను 'బిడ్డా' అని పిలవగానే నాకు ఏడుపు ఆగలేదు .. అక్కడే ఏడ్చేశాను. సరళగారు మళ్లీ పుడతారు .. ఆమె అనుకున్నది సాధించుకుంటారు అంటూ వాళ్లను ఓదార్చాను. సరళగారి కుటుంబసభ్యులకు సంతృప్తిని కలిగించేలా వేణుగారు ఈ సినిమాను తీశారంటే, ఆయన ఎంత హార్డు వర్క్ చేశారో అర్థం చేసుకోవచ్చును" అంటూ చెప్పుకొచ్చింది.

Rana Daggubati
Sai Pallavi
Virata parvam Movie
  • Loading...

More Telugu News