Madhu Shalini: తమిళ నటుడ్ని పెళ్లాడిన తెలుగు నటి మధుశాలిని

Telugu actress Madhu Shalini weds Tamil actor Gokul Anand
  • పలు తెలుగు చిత్రాల్లో నటించిన మధుశాలిని
  • తమిళ నటుడు గోకుల్ ఆనంద్ తో వివాహం
  • హాజరైన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు
అందరివాడు, కితకితలు, వాడు వీడు వంటి చిత్రాల్లో నటించిన తెలుగు నటి మధుశాలిని పెళ్లిచేసుకుంది. తమిళ నటుడు గోకుల్ ఆనంద్ తో ఆమె వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. మధుశాలిని, గోకుల్ ఆనంద్ తమిళంలో 'పంచారాక్షరం' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాతోనే ఇద్దరికీ పరిచయం కాగా, ఆపై అది ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. 

కాగా, తన పెళ్లి విషయాన్ని మధుశాలిని స్వయంగా వెల్లడించింది. తమ జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని పేర్కొంది. మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో స్పందించింది.

Madhu Shalini
Gokul Anand
Wedding
Tollywood
Kollywood

More Telugu News