Abhimanyu: 'ఎంసీఏ' రీమేక్ అక్కడ తేడా కొట్టేసింది!

Nikamma Movie Update

  • తెలుగులో హిట్ కొట్టిన 'ఎంసీఏ
  • హిందీలో 'నికమ్మ' టైటిల్ తో రీమేక్ 
  • నిన్ననే విడుదలైన సినిమా
  • తొలి రోజునే ఫ్లాప్ టాక్  

నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా రూపొందింది. నాని జోడీగా సాయిపల్లవి నటించిన ఈ సినిమాలో, ఆయన వదిన పాత్రలో భూమిక మెప్పించింది. 'నికమ్మ' టైటిల్ తో హిందీలో ఈ సినిమాను రీమేక్ చేశారు. అహ్మద్ ఖాన్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. 

ఈ సినిమాలో నాని పాత్రలో అభిమన్యు దాసానీ .. సాయిపల్లవి పాత్రలో షిర్లే సెటియా .. భూమిక పాత్రలో శిల్పా శెట్టి నటించారు. తొలి రోజున దేశవ్యాప్తంగా 25 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. తెలుగులో మాదిరిగా సరైన ఆర్టిస్టులు పడకపోవడమే కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తెలుగులో ఓ మరిది ఎలా ఉండాలో నాని అలాగే కనిపిస్తాడు. వదిన పాత్రలోని హుందాతనంతో ఆ పాత్రకి భూమిక ఒక నిండుదనాన్ని తీసుకొచ్చింది. ఇక సాయిపల్లవి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు. ఆమె చేసిన పాత్రను గ్లామర్ గా కనిపించడం మాత్రమే తెలిసిన షిర్లేతో చేయించడం అతిపెద్ద మైనస్ గా చెప్పుకుంటున్నారు.

Abhimanyu
Sherly
Shilpa Shetty
Nikamma Move
  • Loading...

More Telugu News