Dale Steyn: మంచి ఆటగాళ్లు తప్పుల నుంచి నేర్చుకుంటారు... ఈ భారత ఆటగాడు ఏమీ నేర్చుకోవడంలేదు: డేల్ స్టెయిన్
- దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్
- ఘోరంగా విఫలమైన రిషబ్ పంత్
- 4 మ్యాచ్ ల్లో 57 పరుగులే చేసిన పంత్
- పంత్ చేసిన తప్పులే చేస్తున్నాడని స్టెయిన్ విమర్శ
టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ లో ఆటగాళ్ల ప్రదర్శనలపై సఫారీ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. టీమిండియా తాత్కాలిక సారథి రిషబ్ పంత్ బ్యాట్ తో వరుసగా విఫలమవుతుండడం పట్ల స్టెయిన్ విమర్శనాత్మకంగా స్పందించాడు.
ఈ సిరీస్ లో పంత్ నాలుగు మ్యాచ్ ల్లో ఆడాడని, ప్రతి మ్యాచ్ లోనూ చేసిన తప్పే చేశాడని స్టెయిన్ విశ్లేషించాడు. మంచి ఆటగాళ్లు తప్పుల నుంచి నేర్చుకుంటారని, కానీ పంత్ ఏమీ నేర్చుకోవడంలేదని పేర్కొన్నాడు. పంత్ ఈ సిరీస్ లో నాలుగు మ్యాచ్ ల్లో కేవలం 57 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.
అదే సమయంలో, 37 ఏళ్ల దినేశ్ కార్తీక్ పై స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. బరిలో దిగిన ప్రతిసారి దినేశ్ కార్తీక్ తానెంతటి క్లాస్ ఆటగాడో నిరూపించాడని కొనియాడాడు. వరల్డ్ కప్ నెగ్గాలని టీమిండియా భావిస్తే, దినేశ్ కార్తీక్ వంటి ఆటగాడు కచ్చితంగా జట్టులో ఉండాలని సూచించాడు.