Secunderabad: సైన్యంలో తుపాకీ పట్టాల్సినోడు పోలీసుల తుపాకీ గుళ్లకు బలయ్యాడు: రాకేశ్ సోదరి కంటతడి
- సికింద్రాబాద్ అల్లర్ల సమయంలో పోలీసుల కాల్పులు
- బుల్లెట్ దిగి ప్రాణాలు కోల్పోయిన రాకేశ్
- బీఎస్ఎఫ్ లో పని చేస్తున్న రాకేశ్ సోదరి రాణి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిన్న చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో రాకేశ్ అనే యువకుడి ఛాతీలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తన సోదరుడి మరణంపై ఆయన సోదరి, బీఎస్ఎఫ్ జవాన్ రాణి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.
తనను స్ఫూర్తిగా తీసుకుని రాకేశ్ సైన్యంలో చేరాలని అనుకున్నాడని చెప్పారు. దేశం కోసం సేవ చేయాలని అనుకున్నాడని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా ఆందోళన చెందాడని చెప్పారు. ఆర్మీలో తుపాకీ పట్టాల్సినోడు పోలీసుల తుపాకీ గుళ్లకు బలయ్యాడని కన్నీరు పెట్టుకున్నారు.