Agnipath Scheme: సికింద్రాబాద్​ విధ్వంసం సూత్రధారి అరెస్ట్.. గుంటూరులోనూ అల్లర్లకు ప్లాన్​!

Man behind secunderabad riots arrested

  • సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా ఆవుల సుబ్బారావు
  • వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి విద్యార్థులను రెచ్చిగొట్టినట్టు పోలీసుల గుర్తింపు
  • అదుపులోకి తీసుకొని విచారిస్తున్న గంటూరు పోలీసులు 

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులు తేల్చారు. దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావును  పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావు పేటలో అతడిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 విధ్వంసం సృష్టించేలా ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులను అతను రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్ తరహాలో గుంటూరులో కూడా ఆందోళన చేపట్టాలని అతను ప్లాన్ చేశాడని గుర్తించారు. సుబ్బారావు గుంటూరులో సాయి డిఫెన్స్ అకాడమీ స్థాపించి ఆర్మీ అభ్యర్థులకు కోచింగ్ ఇస్తున్నాడు. ఇతర నగరాల్లో కూడా అకాడమీలు ఏర్పాటు  చేశాడు.

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని సుబ్బారావు పలు వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి అభ్యర్థులకు పిలుపునిచ్చాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను  ముట్టడించాలని రెచ్చగొట్టాడు. సుబ్బారావు కూడా గుంటూరు నుంచి గురువారం రాత్రి హైదరాబాద్ కు వచ్చాడు. వాట్సప్ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు సందేశాలు పంపించడంతోనే అల్లర్లు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు.

Agnipath Scheme
secunderabad riots
Telangana
raiway station
students
defence
subbarao
Guntur District
  • Loading...

More Telugu News