traffic: తన వాకింగ్​ కోసం రోడ్​నే బ్లాక్​ చేయించిన ట్రాఫిక్​ ఏసీపీ.. ఎక్కడంటే..!

Traffic cop blocking road for his morning walk in Kochi

  • కొచ్చిలో ట్రాఫిక్ ఏసీపీ వినోద్ పిళ్లై నిర్వాకం
  • ఇబ్బంది పడ్డ సాధారణ ప్రజలు 
  • నోటీసులు జారీ చేసిన ఉన్నతాధికారులు

ఢిల్లీలో ఓ ఐఏఎస్ అధికారి త‌న పెంపుడు కుక్కతో క‌లిసి సాయంత్రం వాకింగ్ చేయ‌డానికి ఓ స్టేడియం మొత్తాన్ని ఖాళీ చేయించి బదిలీకి గురైన విషయం మరవకముందే దాదాపు అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఓ పోలీసు అధికారి ఉదయం పూట వాకింగ్ చేసేందుకు ఓ రోడ్డును బ్లాక్ చేయించారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆ అధికారికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన కొచ్చిలో జరిగింది. 

కొచ్చి ట్రాఫిక్ వెస్ట్ జోన్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తున్న వినోద్ పిళ్లై  క్వీస్ వాక్‌వేలో ప్రతి రోజు ఉదయం వాకింగ్ కు వస్తుంటారు. సాధారణంగా ప్రతి ఆదివారం ఉదయం 6-7 గంటల వరకు పిల్లలు సైకిల్ తొక్కడం,  స్కేటింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం ఈ రహదారిని మూసివేస్తారు. కానీ వినోద్ పిళ్లై తన వాకింగ్ కోసం ఇతర రోజుల్లో కూడా రహదారిని బ్లాక్ చేయించారు.

గత మూడు రోజులుగా రోడ్డుపైకి ఎవ్వరినీ అనుమతించకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ మళ్లించిన ఫొటోలు, ఆ రోడ్డుకు అవతలి వైపు నుంచి పిల్లలను బస్సులు ఎక్కిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సదరు ఏసీపీ నిర్వాకం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో, ఆయనకు నోటీసులు జారీ చేశారు.

traffic
police
road block
Kerala
kochi
acp
morning walk
Social Media
notice
  • Loading...

More Telugu News