pulwama: పుల్వామాలో ఎస్​ఐని ఇంటికొచ్చి కాల్చేసిన ఉగ్రవాదులు

Jammu kashmir cop shot dead terrorists inside his home pulwama

  • శుక్రవారం అర్ధరాత్రి దాడి
  • అక్కడికక్కడే చనిపోయిన ఎస్ఐ ఫరూక్ అహ్మద్ మీర్
  • ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు

జమ్మూ కశ్మీర్లోని పుల్వామా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఉగ్రవాదులు అక్కడ మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ పోలీస్ అధికారి ఇంట్లోకి చొరబడి అతడిని కాల్చి చంపారు. పుల్వామా జిల్లా పాంపోర్‌ ప్రాంతంలోని సంబూరాలో ఈ ఘటన జరిగింది. 

ఎస్‌ఐ ఫరూఖ్‌ అహ్మద్‌ మీర్‌ ఇంటిపై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఎస్పైపై కాల్పులు జరిపారు. ముష్కరుల దాడిలో గాయపడ్డ ఎస్ఐ ఫరూక్ అక్కడిక్కడే చనిపోయారు. ఫరూక్ ప్రస్తుతం లేత్‌పొరాలో సిటీసీలోని ఐఆర్‌పీ 23వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు తండ్రి, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

More Telugu News