: రితుపర్ణో ఘోష్ అస్తమయం


తన చిత్రాలతో ప్రేక్షకులను, అవార్డుల జ్యూరీ సభ్యుల మనసులనూ గెలుచుకున్న విఖ్యాత బెంగాలీ దర్శకుడు రితుపర్ణో ఘోష్ ఈ ఉదయం కోల్ కతాలో కన్ను మూశారు. 49 ఏళ్ల రితుపర్ణో గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. 2012లో 'చిత్రాంగద' చిత్రానికి జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డు ఆయనను వరించింది. 1994లో 'ఉనిషె ఏప్రిల్' చిత్రం ద్వారా తొలిసారిగా రితుపర్ణో ఘోష్ వెలుగులోకి వచ్చారు. 19 ఏళ్ల సినీ జీవితంలో ఆయన కళాసేవకు 12 అవార్డులు వచ్చాయి. వీటిలో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలూ ఉన్నాయి.

  • Loading...

More Telugu News