Prabhas: ప్రభాస్ తో చేసే సినిమా ఆ తరహాలో ఉంటుంది: మారుతి

Maruthi movies update

  • 'పక్కా కమర్షియల్' ప్రమోషన్స్ లో మారుతి 
  • ప్రభాస్ తో సినిమా ఉందంటూ క్లారిటీ
  • ఫ్యాన్స్ అంచనాలకి తగినట్టుగా ఉంటుందంటూ స్పష్టీకరణ
  • ఆల్రెడీ కథ వినిపించడం జరిగిపోయిందంటూ వివరణ

మొదటి నుంచి కూడా మారుతి వినోదభరితమైన కథలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'పక్కా కమర్షియల్' సినిమా రూపొందింది. గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా జులై 1వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మారుతి బిజీగా ఉన్నాడు.

ప్రభాస్ తో మారుతి ఒక సినిమా చేయనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ స్థాయి సినిమాలను మారుతి చేయగలడా? అనే కామెంట్లు వచ్చాయి. అందుకు సంబంధించిన ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో మారుతికి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ప్రభాస్ సినిమా తీయడమనేది ఖరారైపోయింది. నా మార్క్ సినిమాకి ప్రభాస్ యాక్షన్ తోడవుతుంది.

ప్రభాస్ కి నేను పెద్ద అభిమానిని .. ఆయన సినిమాలు ఎలా ఉండాలని నేను కోరుకుంటానో అలాగే ఆయనను చూపిస్తాను. ప్రభాస్ ఫ్యాన్స్ ఆశించే మాదిరిగానే ఈ సినిమా ఉంటుంది. ఒక 'బుజ్జిగాడు' .. ఒక 'డార్లింగ్' తరహా కథనే ఆయనకి నేను వినిపించాను. ఆ తరహాలోనే అంతకి మించి అన్నట్టుగా ఈ సినిమా ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు.

Prabhas
Maruthi
Tollywood
  • Loading...

More Telugu News