Naga Chaitanya: ఏంటో .. ఏంటేంటో .. : 'థ్యాంక్యూ' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

Thank you movie lyrical song released

  • విక్రమ్ కుమార్ నుంచి మరో విభిన్న చిత్రం
  • ప్రేమ ప్రధానంగా సాగే కథ
  • చైతూ సరసన ముగ్గురు నాయికలు 
  • జులై 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు

విక్రమ్ కుమార్ సినిమాల్లో ఫీల్ ఎక్కువగా ఉంటుంది. తాను అనుకున్న ఫీల్ వచ్చే వరకూ కథపై ఆయన కసరత్తు చేస్తూనే ఉంటాడు. అందువల్లనే ఆయన నుంచి ఒక సినిమా రావడానికి ఎక్కువ సమయమే పడుతూ ఉంటుంది. ఎప్పటి కప్పుడు ఆయన కొత్త జోనర్లలో సినిమాలు చేస్తూ వెళుతుంటాడు. 

ఆయన తాజా చిత్రంగా 'థ్యాంక్యూ' రూపొందింది. నాగచైతన్య కథానాయకుడిగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతూ సరసన నాయికలుగా రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవికా గోర్ కనిపించనున్నారు. 

 తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. "ఏంటో ఏంటేంటో .. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో' అంటూ ఈ పాట సాగుతోంది. చైతూ .. మాళవిక నాయర్ పై చిత్రీకరించిన పాట ఇది. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, జొనిత గాంధీ ఆలపించారు. ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. జులై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

More Telugu News