Kiran Abbavaram: లైఫ్ లో నీకు ఏ అమ్మాయి కరెక్ట్ కాదు: 'సమ్మతమే' ట్రైలర్ రిలీజ్!

Sammathame  trailer released

  • మరో ప్రేమకథగా 'సమ్మతమే'
  • కిరణ్ అబ్బవరం జోడీగా చాందిని
  • దర్శకుడిగా గోపీనాథ్ రెడ్డి పరిచయం 
  • ఈ నెల 24వ తేదీన సినిమా రిలీజ్   

కిరణ్ అబ్బవరం హీరోగా 'సమ్మతమే' సినిమా రూపొందింది. యు.జి. ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. లవ్ .. ఎమోషన్స్ ప్రధానంగా సాగే కథ ఇది. చాందినీ చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నాయిక నాయకుల మధ్య ప్రేమ .. సరదాలు .. అలకలు .. బుజ్జగింపులు .. వినోదాలు .. విషాదాలు .. ఇలా అన్ని అంశాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఒక కీలకమైన పాత్రలో సీనియర్ నటి సితార కనిపిస్తున్నారు. 

'లైఫ్ లో నీకు గోల్ ముఖ్యమా .. గాళ్ ముఖ్యమా' అని హీరోయిన్ అడిగితే, 'నా లైఫ్ లోకి గాళ్ రావడమే నా గోల్' అనే హీరో డైలాగ్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. 'లైఫ్ లో నీకు ఏ అమ్మాయి కరెక్ట్ కాదు..' అంటూ హీరోపై హీరోయిన్ కోపాన్ని వ్యక్తం చేసే సీన్ సినిమాపై ఆసక్తిని పెంచేదిగా ఉంది.

Kiran Abbavaram
Chandini
Sammathame Movie

More Telugu News