Niharika Konidela: థాంక్యూ కల్యాణ్ బాబాయ్: కొణిదెల నిహారిక

Niharika Konidela thanked Pawan Kalyan

  • కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటున్న పవన్
  • రూ.35 లక్షల విరాళం అందించిన పవన్ కుటుంబీకులు
  • పవన్ ను కొనియాడిన నిహారిక

ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలురైతుల కుటుంబాలకు జనసేన పార్టీ ఆర్థికసాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు కొన్నిరోజుల కిందట రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. దీనిపై కొణిదెల నిహారిక స్పందించారు.

"ప్రజలకు ఆశావాద, విశ్వాసంతో కూడిన భవిష్యత్ ను నిర్మించాలనే మీ బృహత్తర ప్రయత్నంలో ఉడుతాభక్తిగా సాయపడేందుకు మాకు అవకాశం కల్పించారు. థాంక్యూ కల్యాణ్ బాబాయ్. నా దృష్టిలో ఎప్పటికీ నాయకుడు అంటే నువ్వే బాబాయ్. మెరుగైన భవిష్యత్ నీతోనే సాధ్యం" అంటూ నిహారిక ట్వీట్ చేశారు.

Niharika Konidela
Pawan Kalyan
Janasena

More Telugu News