up: యూపీలో అక్రమ కట్టడాల కూల్చివేతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- చట్ట ప్రకారమే కూల్చివేతలు జరగాలన్న సుప్రీం
- ప్రతీకారాత్మకంగా ఉండకూడదన్న ధర్మాసనం
- దీనిపై తాము స్టే విధించలేమని పిటిషనర్ కు స్పష్టీకరణ
- స్పందన తెలియజేయాలని యూపీ సర్కారుకు నోటీసులు
ఉత్తరప్రదేశ్ సర్కారు అక్రమ కట్టడాల కూల్చివేతలో అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు గురువారం వాదనలు జరిగాయి. కట్టడాల కూల్చివేతలకు ముందు నిర్ణీత విధానాన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతా చట్టబద్ధంగానే జరగాలని పేర్కొంది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్ లో అల్లర్లు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రయాగ్ రాజ్ అల్లర్ల వెనుక ప్రధాన సూత్రధారి ఇంటికి అక్కడి మున్సిపల్ యంత్రాంగం నోటీసు జారీ చేసి, పాక్షికంగా కూల్చివేసింది.