ABC Private Limited: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు షాక్.. పిటిషన్ కొట్టేసి రూ. 10 లక్షల జరిమానా విధించిన లా ట్రైబ్యునల్

NCLT Shocks TV9 Ex CEO Ravi Prakash

  • ఏబీసీ ప్రైవేటు లిమిటెడ్‌ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ పిటిషన్
  • సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు వెలువరించిన ట్రైబ్యునల్
  • రవిప్రకాష్ చర్యలు అనైతికమని వ్యాఖ్య
  • వాటాల కొనుగోలులో అక్రమాలు జరగలేదని స్పష్టీకరణ

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) హైదరాబాద్ బెంచ్ షాకిచ్చింది. ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేసి రూ. 10 లక్షల జరిమానా విధించింది. టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేటు లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, సంస్థను స్వాధీనం చేసుకున్న వారిని నియంత్రించాలంటూ రవిప్రకాష్, కేవీఎన్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం ట్రైబ్యునల్ నిన్న తీర్పు వెలువరించింది.

టీవీ9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్నీ చట్టబద్ధంగా జరిగాయని తేల్చి చెప్పింది. వాటాలు కొనుగోలు చేసిన జూపల్లి జగపతిరావు, ఇతర డైరెక్టర్లను ఇబ్బంది పెట్టేందుకు రవిప్రకాష్ చేసిన చర్యలు అనైతికమని పేర్కొంది. వాటాల విక్రయ ఒప్పందం ఆయనకు కూడా తెలిసే జరిగిందని, అందులో ఆయన కూడా భాగమేనని పేర్కొంటూ.. ప్రతివాదులకు రూ.10 లక్షలు చెల్లించాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.

ABC Private Limited
NCLT
Ravi Prakash
TV9
  • Loading...

More Telugu News