TDP: గుంటూరు సీఐడీ ఆఫీస్‌లో మహిళా నేత సహా ముగ్గురు టీడీపీ నేతల విచారణ
![ap cid interrogating three tdp leaders including one woman leader](https://imgd.ap7am.com/thumbnail/cr-20220615tn62a9edab97e64.jpg)
- అమ్మ ఒడి నిలిపేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు
- వీటిపై కేసు నమోదు చేసిన ఊపీ సీఐడీ
- ముగ్గురు టీడీపీ నేతలను విచారణకు పిలిచిన సీఐడీ
- బుధవారం ఉదయం నుంచి రాత్రి దాకా విచారణ
ఏపీ సీఐడీ అధికారులు బుధవారం విపక్ష టీడీపీకి చెందిన ముగ్గురు నేతలను విచారణ కోసం గుంటూరులోని తమ కార్యాలయానికి పిలిపించారు. సదరు నేతలను అధికారులు రాత్రి పొద్దు పోయే దాకా విచారిస్తూనే ఉన్నారు. అమ్మ ఒడి పథకాన్ని నిలిపేశారంటూ ఇటీవలే సోషల్ మీడియాలో పలు పోస్టులు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీఐడీ... కేసు దర్యాప్తులో భాగంగానే టీడీపీ నేతలను విచారణకు పిలిచినట్లు సమాచారం. సీఐడీ విచారిస్తున్న టీడీపీ నేతల్లో ఏలూరు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి పోట్ల రాము, సర్వేపల్లి నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ నేత సూర్య గౌడ్, తెనాలి పట్టణ టీడీపీ మహిళా నేత సీతారత్నం ఉన్నారు.