Akash Puri: వచ్చే వారంలో వరుస బెడుతున్న చిన్నసినిమాలివే!

Chor Bazaar movie update

  • నిన్నమొన్నటి వరకూ సాగిన పెద్ద సినిమాల జోరు 
  • వెయిట్ చేస్తూ వచ్చిన చిన్న సినిమాలు 
  • ఈ నెల  24న అరడజనుకి  పైగా సినిమాల విడుదల 
  • ఏ సినిమాకీ బజ్ లేకపోవడం ఆశ్చర్యం  

ఈ మధ్య కాలంలో థియేటర్లకు వరుసగా పెద్ద సినిమాలే వచ్చాయి. 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' .. 'కేజీఎఫ్ 2' .. 'ఆచార్య' .. 'సర్కారువారి పాట' .. ' ఎఫ్ 3' వరకూ ఈ పెద్ద సినిమాల సందడే నడిచింది. అందువలన చిన్న సినిమాలు రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాయి. ఇక ఇప్పుడు ఒక్కొక్కటిగా థియేటర్ల బాట పడుతున్నాయి. 

ఈ నెల 17వ తేదీన 'విరాటపర్వం' .. 'గాడ్సే' సినిమాలు రంగంలోకి దిగుతుండగా, ఈ నెల 24వ తేదీన అరడజనుకి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. సమ్మతమే .. చోర్ బజార్ .. 7డేస్  6 నైట్స్ .. షికారు .. టెన్త్ క్లాస్ డైరీస్ .. గ్యాంగ్ స్టర్ గంగరాజు వంటి సినిమాలు ఒకే రోజున థియేటర్లకు వస్తున్నాయి. 

ఇవి కాకుండా మరో రెండు మూడు సినిమాలు కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మతమే .. చోర్ బజార్ ..  7డేస్ 6 నైట్స్ కి మాత్రం కాస్త ఎక్కువ  ప్రమోషన్స్ నడుస్తున్నాయి. అయితే ఈ సినిమాలన్నింటిలో దేనిపై కూడా ఎలాంటి అంచనాలు లేవు. థియేటర్స్ కి వచ్చిన తరువాత అవి తమ సత్తా చాటుకోవలసిందే.

Akash Puri
Gehna Sippy
Chor Bazaar Movie
  • Loading...

More Telugu News