Sai Pallavi: సాయిపల్లవి కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోనిది అందుకేనా?

Sai Pallavi Interview

  • 'విరాట పర్వం' ప్రమోషన్స్ లో సాయిపల్లవి
  • ఈ నెల 27వ తేదీన విడుదలవుతున్న సినిమా 
  • ఇంతవరకూ మరో ప్రాజెక్టు ఒప్పుకోని సాయిపల్లవి 
  • తన పెళ్లి ప్రస్తావనతో అభిమానుల్లో సందేహాలు  

సాయిపల్లవిని చూస్తే ప్రతి విషయం పట్ల పూర్తి అవగాహనతో .. పర్ఫెక్ట్ ప్రణాళికతో ఆమె ముందుకు వెళుతోందనే విషయం అర్థమైపోతుంటుంది. ఆమె మాటల్లో కూడా ఆ విషయం స్పష్టమవుతుంటుంది. తన సినిమాల ఎంపిక విషయంలోనే ఎంతో జాగ్రత్తగా ఉండే సాయిపల్లవి, తన వ్యక్తిగత జీవితం విషయంలోను అంతే ప్లానింగుతో వ్యవహరిస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ 2023లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాననీ, తనకి 30 ఏళ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉండాలనేది ఆలోచన అని చెప్పుకొచ్చింది. సాయిపల్లవి ఇలా హఠాత్తుగా పెళ్లి విషయాన్ని ప్రస్తావించడం .. అందుకు పెద్ద సమయం కూడా లేకపోవడంతో అభిమానులు షాక్ అయ్యారు.

ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో తెలుగు సినిమా ఏదీ లేదు. 'విరాటపర్వం' సినిమాను పూర్తిచేసి కూడా చాలా కాలమైంది. కథలు నచ్చకపోవడం వలన గ్యాప్ వచ్చి ఉంటుందని అనుకున్న వాళ్లంతా, ఈ ఇంటర్వ్యూ తరువాత .. పెళ్లి విషయం కారణంగానే ఆమె కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవడం లేదేమోనని అనుకుంటున్నారు. ఈ విషయంలో సాయిపల్లవి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

Sai Pallavi
Rana Daggubati
Virata parvam
  • Loading...

More Telugu News