Deepika Padukone: నిన్న ఆసుపత్రిలో చేరిన దీపికా ప‌దుకొణే.. ఎందుకు వెళ్లిందో క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు!

Deepika Padukone went to hospital for normal check up says producers

  • హార్ట్ బీట్ పెరగడంతో ఆసుపత్రిలో చేరినట్టు హల్ చల్ చేసిన వార్తలు
  • నార్మల్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లిందన్న నిర్మాతలు
  • ఇలాంటి వార్తలను నమ్మొద్దని అభిమానులకు విన్నపం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే నిన్న అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో షూటింగ్ లో ఉన్న ఆమె అస్వస్థతకు గురయ్యారు. హార్ట్ బీట్ పెరగడంతో ఆమెను హుటాహుటిన కామినేని ఆసుపత్రికి తరలించినట్టు, చికిత్స అనంతరం నోవాటెట్ హోటల్ లో ఆమెను డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉంచినట్టు నిన్న వార్తలు హల్ చల్ చేశారు. 

మరోవైపు ఆమె ఆరోగ్య పరిస్థితిపై సినీ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. దీపిక ఆరోగ్యం బాగుందని వారు చెప్పారు. కేవలం నార్మల్ చెకప్ కోసమే ఆమె ఆసుపత్రికి వెళ్లారని తెలిపారు. వాస్తవాలను తెలుసుకోకుండా వార్తలు రాయొద్దని కోరారు. ఇలాంటి వార్తలను నమ్మొద్దని అభిమానులను కోరారు. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కే' చిత్రంలో దీపిక నటిస్తోంది. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

  • Loading...

More Telugu News