Rana: 'విరాట పర్వం' మేకప్ లేకుండా చేశాను: సాయిపల్లవి

Virataparvam movie update

  • 'విరాటపర్వం' ప్రమోషన్స్ లో సాయిపల్లవి
  • వెన్నెల పాత్రను పోషించానంటూ వివరణ 
  • సహజత్వం కోసం కష్టపడ్డామంటూ స్పష్టీకరణ 
  • రానా గొప్ప ఆర్టిస్ట్ అంటూ కితాబు

సాయిపల్లవి తాజా చిత్రంగా 'విరాటపర్వం' రూపొందింది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయిపల్లవి మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను 'వెన్నెల' పాత్రలో కనిపిస్తాను. ఒక గ్రామీణ నేపథ్యంలో పెరిగిన అమ్మాయి ఎలా ఉంటుందో .. అలాగే ఈ సినిమాలో కనిపిస్తాను.

సాధారణంగా నేను మేకప్ తక్కువగానే వేసుకుంటాను .. ఐ లైనర్ మాత్రం తప్పకుండా వేసుకుంటాను. కానీ ఈ సినిమాలో మాత్రం మేకప్ లేకుండానే చేశాను. షాట్ రెడీ అనగానే ముఖం కడుక్కుని కెమెరా ముందుకు వెళ్లిపోయేదానిని. ఆ పాత్ర సహజత్వం కోసం అలా చేయవలసి వచ్చింది. దర్శకుడు వేణు ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇక నాకు ఇచ్చిన పాత్రను సాధ్యమైనంత సహజంగా చేయడానికి ట్రై చేస్తుంటాను. ఒక పాత్రను ఏ స్థాయి వరకూ తీసుకుని వెళ్లొచ్చు అనే విషయంలో నాకు ఒక అవగాహన ఉంది. ఇక ఒక కథను ఎక్కడి వరకూ తీసుకుని వెళ్లొచ్చు అనేది రానాగారికి బాగా తెలుసు. ఆయన నుంచి నేను నేర్చుకున్నది అదే" అంటూ చెప్పుకొచ్చింది.

Rana
Sai Pallavi
Virataparvam Movie
  • Loading...

More Telugu News