Sai Pallavi: అందుకే పవన్ అంటే అంత ఇష్టం: సాయిపల్లవి

Virataparvam movie update

  • 'విరాటపర్వం' ప్రమోషన్సులో సాయిపల్లవి
  •  గేమ్ లో భాగంగా వచ్చిన పవన్ ప్రస్తావన 
  • ఆయన ముక్కుసూటి మనిషి అంటూ సాయిపల్లవి కితాబు 
  • ఈ నెల 17న ఈ సినిమా విడుదల   

సాయిపల్లవి ఒక కథను ఒప్పుకుందంటే అందులో ఏదో కొత్తదనం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకులకు కలుగుతుంది. తన సినిమాల ద్వారా ఆమె అలాంటి ఒక నమ్మకాన్ని సంపాదించుకుంది. ఆమె తాజా చిత్రంగా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'విరాటపర్వం' సినిమా సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయిపల్లవి ఈటీవీలో 'క్యాష్' ప్రోగ్రామ్ కి హాజరైంది. ఈ షోలో పవన్ ప్రస్తావన రాగా సాయిపల్లవి స్పందిస్తూ .. "పవన్ కల్యాణ్ గారికి అంత క్రేజ్ ఉన్నప్పటికీ ఒక సాధారణమైన వ్యక్తి మాదిరిగానే ఆయన నడుచుకుంటారు. తన మనసులోని విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చింది. 

గతంలో ఒక వేదికపై సుకుమార్ మాట్లాడుతూ సాయిపల్లవిని ' లేడీ పవర్ స్టార్' అంటూ కితాబునిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అభిమానులు ఆమెను అలాగే పిలుస్తున్నారు కూడా. రేపు జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ కూడా హాజరవుతున్న సంగతి తెలిసిందే.

Sai Pallavi
Rana Daggubati
Virataparvam Movie
  • Loading...

More Telugu News