Lawrence: లారెన్స్ హీరోగా 'చంద్రముఖి 2' .. టైటిల్ పోస్టర్ రిలీజ్!

Chadramukhi movie update

  • 2005లో వచ్చిన 'చంద్రముఖి' ఓ సంచలనం 
  • సీక్వెల్ గా రూపొందుతున్న 'చంద్రముఖి 2'
  • పి.వాసు దర్శకత్వంలో సీక్వెల్   
  • సంగీత దర్శకుడిగా కీరవాణి

'చంద్రముఖి' .. 2005లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. ఎందుకంటే ఈ సినిమా నమోదు చేసిన సంచలనం అలాంటిది. పి. వాసు టేకింగ్ ..  బలమైన కథాకథనాలు .. ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలు .. విద్యాసాగర్ సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. 

రజనీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. అలాంటి ఈ సినిమాకి ఆయనతోనే  సీక్వెల్ ప్లాన్ చేశారుగానీ కుదరలేదు. రజనీ కాంత్ అంతగా ఆసక్తిని చూపడం లేదనే టాక్ వచ్చింది. అనుకున్నట్టుగానే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ను లారెన్స్ తో చేస్తున్నారు దర్శకుడు పి.వాసు. 

'చంద్రముఖి 2' టైటిల్ ను ఖరారు చేసి .. కొంతసేపటి క్రితం అధికారిక పోస్టర్ ను వదిలారు. 'చంద్రముఖి'లో ఉత్కంఠను రేకెత్తించే మేడపై గదినే పోస్టర్  లో చూపించారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. లారెన్స్ - పి.వాసు కాంబినేషన్లో గతంలో 'శివలింగ' వచ్చిన సంగతి తెలిసిందే.

Lawrence
Vasu
Chandramukhi 2 Movie
  • Loading...

More Telugu News