Rahul Gandhi: మోదీ ఉద్యోగాల సృష్టిలో నిపుణుడు కాదు... ఉద్యోగాలపై వార్తలు సృష్టించడంలో నిపుణుడు: రాహుల్ గాంధీ

Rahul Gandhi slams PM Modi over jobs issue

  • 10 లక్షల ఉద్యోగాల భర్తీకి కేంద్రం నిర్ణయం
  • పీఎంవో నుంచి ప్రకటన
  • ఏడాదిన్నరలో నియామకాలు జరగాలని ఆదేశం
  • ఇది మహా తప్పుడు హామీ అని రాహుల్ విమర్శలు

వచ్చే ఒకటిన్నర సంవత్సర కాలంలో 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారీ చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడడం తెలిసిందే. దేశంలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 

ఎనిమిదేళ్ల కిందట ఇలాగే హామీలిచ్చారని వెల్లడించారు. అప్పుడు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ఇప్పుడు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పడం కూడా అదే కోవలోకి వస్తుందని విమర్శించారు. ఇది తప్పుడు హామీలు ఇచ్చే ప్రభుత్వం కాదని, మహా తప్పుడు హామీలు ఇచ్చే ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఉద్యోగాల సృష్టిలో నిపుణుడు కాదు... ఉద్యోగాలపై వార్తలు సృష్టించడంలో నిపుణుడు అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News