Daggubati Purandeswari: పురందేశ్వరిపై కొడాలి నాని విష ప్రచారం చేస్తున్నారు: బీజేపీ నేత మట్టా ప్రసాద్

BJP demands Kodali Nani to tender apology to Purandeswari
  • గుడివాడలో రైల్వే ఫ్లై ఓవర్లను పురందేశ్వరి అడ్డుకుంటున్నారన్న కొడాలి నాని
  • కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న మట్టా ప్రసాద్
  • పురందేశ్వరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్
గుడివాడలో రైల్వే ఫ్లై ఓవర్లను అడ్డుకోవాలని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి యత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను కృష్ణా జిల్లా బీజేపీ నేతలు ఖండించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు మట్టా ప్రసాద్ మాట్లాడుతూ కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు.

గుడివాడలో రైల్వే ఫ్లై ఓవర్లు నిర్మించాలని 2020లో కేంద్ర మంత్రికి పురందేశ్వరి ద్వారా తాము స్వయంగా వినతిపత్రాన్ని ఇచ్చామని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే పురందేశ్వరిని కొడాలి నాని వివాదాల్లోకి లాగుతున్నారని చెప్పారు. పురందేశ్వరిని అనవసర వివాదాల్లోకి లాగితే సహించేది లేదని హెచ్చరించారు. గుడివాడ ప్రజలకు కొడాలి నాని ఎప్పుడో దూరమయ్యారని చెప్పారు. పురందేశ్వరికి కొడాలి నాని తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Daggubati Purandeswari
BJP
Matta Prasad
Kodali Nani
YSRCP

More Telugu News