Swara Bhaskar: ప్రవక్తపై వ్యాఖ్యల వివాదం... గౌతమ్ గంభీర్ ట్వీట్ పై స్వరా భాస్కర్ స్పందన

Swara Bhaskar counters Gautam Gambhir tweet over Nupur issue
  • మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు
  • దేశవ్యాప్తంగా నిరసనలు
  • లౌకిక ఉదారవాదులు మౌనం వీడడంలేదన్న గంభీర్
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మద్దతు పలకడం పట్ల బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ స్పందించారు. నుపుర్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, ఆమెపై విద్వేషం వెళ్లగక్కుతున్నారని, ఇంత జరుగుతున్నా లౌకిక ఉదారవాదులుగా చెప్పుకునేవారు మౌనం వీడడంలేదని గంభీర్ విమర్శించారు. 

గంభీర్ వ్యాఖ్యలను స్వరా భాస్కర్ తప్పుబట్టారు. ఇలాంటి వారికి బుల్డోజర్ల శబ్దం వినిపించడం లేదేమో! అంటూ వ్యాఖ్యానించారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై యూపీలో ఆందోళనలు చేపట్టినవారి ఆస్తులను బుల్డోజర్లతో ధ్వంసం చేయడాన్ని స్వరా భాస్కర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరసనలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ఇలా బుల్డోజర్ దాడులు చేపడుతోందని విమర్శలు వస్తుండడం తెలిసిందే.
Swara Bhaskar
Gautam Gambhir
Nupur Sharma
Prophet
BJP

More Telugu News