Nara Lokesh: జగన్ చేసిన ప్రతి మోసాన్ని బయటపెడతాం: నారా లోకేశ్

Lokesh fires on CM Jagan

  • ఏపీలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు
  • మాట మార్చి, మడం తిప్పారంటూ లోకేశ్ ఫైర్
  • గతంలో తప్పుడు ప్రచారం చేశారని విమర్శ  
  • ఇప్పుడదే జగన్ రైతుల మెడకి ఉరితాడు బిగిస్తున్నారని ఆగ్రహం

రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారంటూ టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మాట మార్చి, మడమ తిప్పి జగన్ మోసం చేస్తున్నాడని, జగన్ చేసిన ప్రతి మోసాన్ని బయటపెడతామని స్పష్టం చేశారు. నాడు టీడీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని జగన్ అసత్య ప్రచారం చేశారని, ఇప్పుడదే జగన్ రైతుల మెడకి మీటర్ల ఉరితాడు బిగిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సాక్షి మీడియా క్లిప్పింగ్ ను కూడా లోకేశ్ పంచుకున్నారు.

Nara Lokesh
Jagan
Meters
Electricity Connections
Farmers
  • Loading...

More Telugu News