Corona Virus: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. 50 వేలు దాటిన యాక్టివ్ కేసులు!

India reports 6594 Corona cases

  • గత 24 గంటల్లో కొత్తగా 6,594 కేసుల నమోదు
  • నిన్నటితో పోలిస్తే 18 శాతం తగ్గిన కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,035

గత మూడు రోజులుగా ప్రతి రోజూ 8 వేలకు పైగా నమోదైన కరోనా కేసులు ఈరోజు తగ్గాయి. గత 24 గంటల్లో 6,594 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 18 శాతం కేసులు తగ్గాయి. ఇదే సమయంలో 4,035 మంది కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,32,36,695కి చేరుకుంది. మొత్తం 4,26,61,37 మంది కోలుకున్నారు. అలాగే ఇప్పటి వరకు 5,24,771 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 50,548 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగా, మరణాల రేటు 1.22 శాతంగా, క్రియాశీలత రేటు 0.12 శాతంగా, పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా కొత్త కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పటి వరకు 195 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. మరోవైపు, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ మాట్లాడుతూ... కరోనా ఇంకా అంతం కాలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Corona Virus
India
Updates
  • Loading...

More Telugu News